'ఇద్దరు వయోజనులు పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటే తప్పేముంది..? సహజీవనం నేరమా..? ఎంతమాత్రం కాదు...' అని చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్, జస్టిస్ దీపక్‌వర్మ, జస్టిస్ ఎస్‌బి చౌహాన్‌లతో కూడిన ధర్మాసనం కుండబద్దలు కొట్టినట్టు మంగళవారం చెప్పింది. అంతేకాదు ద్వాపరయుగంలో రాధాకృష్ణులు సహజీవనం చేశారని పురాణాలు చెబుతున్నాయని కూడా ఉటంకించింది.
పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం తప్పేమీ కాదని కుష్బూ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని చెప్పిన కోర్టు.. ఆ వ్యాఖ్యల వల్ల ఎవరికీ వచ్చిన నష్టం ఏమీ లేదని కూడా చెప్పింది. సుప్రీంకోర్టు ధర్మాసనం వెలిబుచ్చిన ఈ అభిప్రాయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయిప్పుడు. ఖుష్బూ వ్యాఖ్యలు యువతను పెడదోవ పట్టించే విధంగా ఉన్నాయనే వాదనలను కూడా కోర్టు తోసిపుచ్చింది.
ఈ సంచలన వ్యాఖ్యల పట్ల అసలు యువత ఏం అనుకుంటోంది..? పెళ్లికి ముందు శృంగారం అవసరమా..? లేక సంప్రదాయాలకు అత్యంత విలువ ఇచ్చే దేశంలో సహజీవనం అనే కాన్సెప్టే తప్పంటోందా..? కోర్టు వ్యాఖ్యలను సమర్థిస్తారా...? లాంటి ప్రశ్నలతో 'సిటీలైఫ్'కొంతమంది యువతీయువకులను ప్రశ్నించింది. కోర్టు వ్యాఖ్యలు సంస్కృతిని కించపరిచే విధంగా ఉన్నాయనే ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో పెళ్లికి ముందు శృంగారం అవసరమా, కాదా అనేది ఆయా వ్యక్తుల వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంటుందని చెబుతూనే తాము మాత్రం దీన్ని అసలు అంగీకరించమని ఎక్కువమంది అంటుంటే, ఒకరిద్దరు మాత్రం ఇద్దరూ ఇష్టపడితే అందులో తప్పేం లేదన్నారు. అయితే ఎక్కువమంది ముక్తకంఠంతో చెబుతున్న మాట మాత్రం కోర్టు వ్యాఖ్యల వల్ల విచ్చలవిడితనం పెరుగుతుందనే.. ఎవరెవరు ఏమన్నారంటే...
పెళ్లికి ముందు శృంగారం తప్పేంటి...?- నేహా, ఎగ్జిక్యూటివ్ క్లయింట్ సర్వీస్
పెళ్లికి ముందు శృంగారం అంటే అంత ఉలిక్కిపడుతున్నారెందుకు..? ఎస్... మన సమాజంలో లివింగ్ టు గెదర్ కాన్సెప్ట్‌ను అంగీకరించరు. అలాగని తప్పేవరూ చేయడం లేదా..? ముంబైలో నాకు తెలిసి ప్రతి రెండు జంటల్లో ఒకటి సహజీవనం చేసేదే.
ఒకవిధంగా ఇప్పుడు దీన్ని చట్టబద్ధం చేయడమే మంచిది. నాకిప్పుడు 22 సంవత్సరాలు. నాకు వ్యక్తిగతంగా ఇష్టమైతే ఎవరితోనైనా కలిసి ఉండొచ్చు. ఇద్దరికీ ఇష్టమైతే శృంగారంలో పాల్గొంటాం. లివింగ్ టు గెదర్ కాన్సెప్ట్‌లో శృంగారంలో పాల్గొన్నా పెళ్లి చేసుకోవాలని లేదు. అందుకు ఇష్టమైతేనే కలిసుంటారు. మన సమాజం అంగీకరించదు... కట్టుబాట్లు అంటారా..? పసలేని కబుర్లు.
నేనొక్కటి అడుగుతాను చెప్పండి... ఫ్యాషన్‌లో స్కర్టులు, జీన్స్ ఫ్యాంట్లు వచ్చినప్పుడు... అవేం బట్టలు. మోకాళ్లు కనబడుతున్నాయి... సంస్కృతి మంటగలుస్తుంది అన్నారు. ఇప్పుడు అమ్మానాన్నలే ఏరికోరి జీన్స్, టీ షర్టులు వాళ్లమ్మాయిలకు కొంటున్నారు. లివింగ్ టు గెదర్ కూడా అంతే..! ఇప్పుడు మనవాళ్లకు దాని గురించి అంతగా తెలీదు కాబట్టి ఈ బాధ. తెలిస్తే ఆల్ హ్యాపీస్..!
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more